మాతృభాషను మరవద్దు

మాతృభాషను మరవద్దు

06-11-2017

మాతృభాషను మరవద్దు

విద్యార్థులు అన్ని భాషలూ నేర్చుకోవాలని, అయితే మాతృభాషను మాత్రం మరిచిపోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ మనిషి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని అన్నారు. మార్కుల కోసం కాకుండా, వ్యక్తితంలో మార్పు కోసం చదవాలన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికీ మరువరాదన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువతకు కేంద్ర ప్రభుత్వం రుణాలిస్తోదని, వాటిని వినియోగించుకుని వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు.