బిటి కనెక్ట్ వైర్లెస్ మాడ్యూల్ ను విడుదల చేసిన జీబ్రానిక్స్

బిటి కనెక్ట్ వైర్లెస్ మాడ్యూల్ ను విడుదల చేసిన జీబ్రానిక్స్

06-11-2017

బిటి కనెక్ట్ వైర్లెస్ మాడ్యూల్ ను విడుదల చేసిన జీబ్రానిక్స్

ఏ పరికరాన్నైనా ౩.5 ఎంఎం ఇన్పుట్ వైర్లెస్ గా మార్చే ఒక విప్లవాత్మకమైన బిటి మాడ్యూల్ 
 
ఐటి విడిభాగాలు, ఆడియో / వీడియో మరియు నిఘా పరికరాలను ఉత్పత్తి చేసే భారత దేశానికి చెందిన ప్రముఖ బ్రాండ్ జీబ్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విప్లవాత్మక వైర్లెస్ మాడ్యూల్ బిటి కనెక్ట్ ను విడుదల చేసింది. ఈ విప్లవాత్మక బ్లూ టూత్ మాడ్యూల్ ౩.5 ఎంఎం జాక్ కలిగిన  ఏ పరికరాన్నైనా ఇన్పుట్ వైర్లెస్ గా మారుస్తుంది. 
 
ఈ మాడ్యూల్ క్రింద పేర్కొన్న పరికరాలను మీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ కు కనెక్ట్ చేస్తుంది 
 
● 3.5ఎంఎం లేదా RCA  ఇన్పుట్ కలిగిన స్పీకర్లను  .
● 3.5ఎంఎం లేదా RCA  ఇన్పుట్ కలిగిన హోమ్ థియేటర్..
● యాక్స్ ఇన్పుట్ కలిగిన కార్ స్టీరియో సిస్టం.
● హెడ్ ఫోన్స్.
 
బిటి కనెక్ట్ అనే ఈ పరికరం చాలా చిన్న మరియు కాంపాక్ట్ మాడల్. దీన్ని మీరు ఏ డివైజ్ కయినా కనెక్ట్ చేసి వైర్ తో అవసరం లేకుండా మ్యూజిక్ ను వినవచ్చు. ఇది చాలా సులభమైన ప్లగ్ అండ్ ప్లే ఫీచర్ ను కలిగి  ఆపరేట్ చెయ్యడం కూడా చాలా సులభం. ఇందులో మైక్ కూడా అమర్చబడి ఉండడంతో మీరు కనెక్ట్ చసిన స్మార్ట్ ఫోన్ నుంచి కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు.
 
ఆడియో అవుట్ పుట్ కోసం చిన్నగా అందంగా కన్పించే ఈ మాడ్యూల్ లో ౩.5ఎంఎం జాక్ కూడా ఉంటుంది. ఇందులో మీడియా కంట్రోల్ బటన్, ఆన్ / ఆఫ్ ఫీచర్, వాల్యూం కంట్రోల్ బటన్, ఎంపి౩ ప్లే బ్యాక్ కోసం మైక్రో ఎస్ డి స్లాట్ కూడా ఉన్నాయి. 
 
ఈ మాడ్యూల్ ఎంత చిన్నగా డిజైన్ చెయ్యబడిందంటే, దీన్ని మీరు మీ బట్టలకు ఎక్కడైనా పిన్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏ పరికరానికైన కనెక్ట్ చేసి వాటిని పూర్తిగా వైర్లెస్ పరికరాలుగా మార్చుకోవచ్చు. తమ ఇంట్లో వినోదాన్ని ఖరీదైనదిగా కన్పించే విధంగా మార్చుకోవాలని కోరుకునేవారికి ఇంతో ఎంతో ఉపయోగకరమైనది. దీన్ని  స్పీకర్లు / హెడ్ ఫోన్స్ కు కనెక్ట్ చేస్తే చాలు అవి వైర్లెస్ పరికరాలుగా మారిపోతాయి. 
 
ఈ బ్లూత్ మాడ్యూల్ లాంచింగ్ సందర్భంగా బీబ్రానిక్స్ ఇండియా  డైరెక్టర్ శ్రీ ప్రదీప్ దోషీ మాట్లాడుతూ “మీరు ఏదైనా వైర్లెస్ పరికరాన్ని ఉపయోగించాలని కోరుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది జీబ్రానిక్స్. ఈ విషంలో ఎల్లప్పుడూ ముందుండే జీబ్రానిక్స్ ఇండియా ఇప్పుడు కూడా ఈ బిటి కనెక్ట్ పేరిట చిన్న పాటి వైర్లెస్ మాడ్యూల్ ను ప్రవేశ పెట్టడం ద్వారా వైర్లెస్ మార్కెట్ లో మరో విప్లవానికి శ్రీకారం చుట్టింది. ‘స్మార్ట్’ అన్న పదానికి ఇది మరో కొత్త అర్థాన్నిస్తుంది. వైర్లెస్ పరికరాలను ఇష్టపడే వారి ఊహలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా, ఏ పరికరన్నైన వైర్లెస్ పరికరంగా మార్చే ఈ మాడ్యూల్ ను రూపొందించడం జరిగింది” అన్నారు. 
 
ఈ మాడ్యూల్ లో ఉన్న బ్లూటూత్ 10 మీటర్ల దూరం వరకు ఎటువంటి అతరాయం లేకుండా  తరగాలను ప్రసారం చెయ్యగలదు. ఇక ఇది క్లిప్ డిజైన్ లో రూపకల్పన చెయ్యడం వల్ల చేతితో పట్టుకోవలసిన అవసరం లేకుండా సులభంగా ఎక్కడైనా, దేనికైనా అతికింది సంగీతాన్ని ఆస్వాదించ వచ్చు. బ్లాక్ అండ్ వైట్ కలర్లలో వస్తున్నా ఈ బ్లూత్ మాడ్యూల్ దేశంలోని అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తుంది.