టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖకు కొత్త కమిటీ

టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖకు కొత్త కమిటీ

06-11-2017

టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖకు కొత్త కమిటీ

టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖకు కొత్త కమిటీ నియామకం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదంలో టీఆర్‌ఎస్‌ ప్రవాస వ్యవహారాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల ఈ కమిటీని ప్రకటించారు. కన్వీనర్లుగా మహిపతి నాగేందర్‌, తాళ్ల చందు, బైరి పూర్ణ, జలగం వెంగల్‌, గంగోని శ్రీనివాసులు నియమితులయ్యారు. తన్నీరు మహేష్‌ అధ్యక్షతన సలహా మండలితోపాటు ప్రాంతీయ ఇన్‌ఛార్జీలు, కార్యనిర్వాహక కమిటీ, ఏరియా ఇన్‌ఛార్జీలు, యువజన కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీ కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖను మూడేళ్ల క్రితం ప్రారంభించారు.