పెరోల్‌ పై చిన్నమ్మ విడుదల
MarinaSkies
Kizen

పెరోల్‌ పై చిన్నమ్మ విడుదల

06-10-2017

పెరోల్‌ పై చిన్నమ్మ విడుదల

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ పెరోల్‌పై విడుదలయ్యారు. అమెకు అయిదు రోజుల పాటు పెరోల్‌ అనుమతి ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు శశికళకు పెరోల్‌ ఇచ్చారు. దీంతో దాదాపు ఎనిమిది నెలల తర్వాత అమె జైలు నుంచి బయటకు వచ్చారు. శశికళను తీసుకెళ్లేందుకు ఆమె మేనల్లుడు దినకరన్‌ అనుచరులు జైలుకు వచ్చారు. శశికళ భర్త నటరాజన్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయనకు కిడ్నీ, లివర్‌ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. తన భర్తను చూసేందుకు పెరోల్‌ మంజూరు చేయాలంటూ శశికళ దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు షరతులతో కూడిన పెరోల్‌ మంజూరైంది. శశికళ చెన్నైలో ఎవరినీ కలవకూడదని, తన బంధువుల ఇంటిలో మాత్రమే ఉండాలని నిబంధనలు విధించారు. ఈ సమయంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, మీడియాకు ప్రకనటలు చేయెద్దని పేర్కొన్నారు.