ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి
MarinaSkies
Kizen

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి

06-10-2017

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా బ్రహ్మానందరెడ్డి దాదాపు 27వేల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అమరావతిలోని సచివాలయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ రూల్స్‌ బుక్‌ను బ్రహ్మానందారెడ్డికి స్పీకర్‌ అందించారు. మంత్రులు సోమిరెడ్డి, అఖిల ప్రియ సమక్షంలో బ్రహ్మానందారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందారెడ్డి మాట్లాడుతూ నాన్న, బాబాయి ఆశయ సాధనకు కృషిచేస్తానని అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 13 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని,  చామ కాల్వ విస్తరణతో భారీ వర్షాలు పడినా ఇబ్బంది ఉండదన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి డబ్బులు అకౌంట్లల్లో జమ చేస్తున్నామని తెలిపారు.