నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి
APEDB
Ramakrishna

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి

12-03-2017

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి

కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.  భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  భూమా నాగిరెడ్డి అకాల మృతితో కర్నూలు జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆయన బంధువు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. వైద్యులు ఆయన్ని బతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు, అనుచరుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కొద్దిసేపు నంద్యాలలో ఉంచి తర్వాత ఆళ్లగడ్డకు తరలిస్తామని చెప్పారు. రేపు ఆళ్లగడ్డలో భూమా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.