మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి : క్రెగ్‌ డికర్‌

మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి : క్రెగ్‌ డికర్‌

08-09-2017

మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి :  క్రెగ్‌ డికర్‌

సమాజం, ఆర్థిక రంగం అభివృద్ధి చెందాలంటే మహిళలు వ్యాపార రంగంలో ప్రవేశించేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలని అమెరికా రాయబార కార్యాలయం కౌన్సెలర్‌ క్రెగ్‌ డికర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన టై, ఐఎస్‌బి కనెక్ట్‌ 8వ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్టప్‌ల విభాగంలో పురుషులే అధికంగా ఉంటున్నారన్నారు. మహిళలు వ్యాపార రంగంలో చేరడాన్ని ప్రోత్సహించేందుకు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ద్వారా మహిళా సాధికారత పై అమెరికా రాయబార కార్యాలయం, టై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధానంగా ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తుందని, వరంగల్‌తో సహా ఐదు నగరాల నుంచి ఐదుగురు వంతున ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి వారికి మార్గదర్శకం చేస్తామని తెలిపారు. ఆరు నెలలపాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం వారు వ్యాపార రంగంలో ప్రవేశించేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతారని అన్నారు. మహిళలు ఆంత్రప్రెన్యూర్లుగా మారేందుకు పలు అవరోధాలు ఎదుర్కొంటున్నారని, కుటుంబ బాధ్యతలు ప్రత్యేకించి అత్తమామలను చూసుకోవడం, సామాజికంగా సరైన ప్రోత్సాహం లభించకపోవడం, ఆర్థిక వనరులు తగినంతగా లేకపోవడం ప్రధాన అవరోధాలుగా తేలిందని, వారు ఆ అవవరోధాలు చేధించుకుని వ్యాపార రంగంలోకి ప్రవేశించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు.