రెండు రకాల వీసా సర్వీసులు
APEDB
Ramakrishna

రెండు రకాల వీసా సర్వీసులు

11-03-2017

రెండు రకాల వీసా సర్వీసులు

భారత్‌ తను జారీ చేసే వీసాలను రెండు రకాలుగా వర్గీకరించింది. ఇంటెర్న్‌ వీసా, ఫిల్మ్‌ వీసాగా పేర్కొంది. భారతీయ కంపెనీలలో ఉద్యోగాలు చేయడానికి వచ్చేవారికి ఇంటెర్న్‌ వీసాలను జారీ చేయనున్నారు. ఈ వీసా ద్వారా దేశంలో గరిష్టంగా ఒక సంవత్సరం పాటు ఉండే అవకాశం ఇస్తారు. ఫీజును 5450 రూపాయలుగా నిర్ణయించారు. ఫిల్మ్‌ వీసాను భారతదేశంలో సినిమా షూటింగ్‌,  టీవీ, వాణిజ్య చిత్రాల చిత్రీకరణకు వచ్చేవారికి జారీచేయనున్నారు. ఈ వీసాతో గరిష్టంగా ఒక సంవత్సరం పాటు భారత్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఫిల్మ్‌ వీసా దరఖాస్తు ఫీజును 8000 రూపాయలుగా నిర్ణయించారు. సంబంధిత వివరాలను పొందుపరచిని వ్యక్తులకు భారతీయ వీసాను జారీ చేయనున్నామని, మార్చి 1 నుంచి ఈ విధానాలు అమలులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.