మే 14న అమెరికాకు ఉస్మానియా విసి
APEDB

మే 14న అమెరికాకు ఉస్మానియా విసి

11-03-2017

మే 14న అమెరికాకు ఉస్మానియా విసి

ఓయూకి ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమెరికాలో ఉన్న పూర్వ విద్యార్థులు నడుం బిగించారు. దాని కోసం ఆ దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నవారందరితో కలిసి ఒక సమావేశం నిర్వహించనున్నారు. వీరిలో శాస్త్రవేత్తలు, వ్యాపార వేత్తలు, ప్రొఫెసర్లుగా చాలా ర ంగాల్లో ఉన్నవారున్నారు. ఈ ఏడాది మే 14న ఈ సమావేశాన్ని చికాగాలో ఏర్పాటు చేశారు. దానికి ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన వస్తున్నట్లు వారికి సమాచారం ఇచ్చారు. దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే వర్సిటీ నుంచి వెళుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు లండన్‌ నుంచి కూడా మరో ఆహ్వానం కూడా వచ్చింది.