విదేశాల్లోనూ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు
APEDB

విదేశాల్లోనూ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు

11-03-2017

విదేశాల్లోనూ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు

వందేళ్ల చరిత్రను భుజస్కందాలపై మోస్తూ తెలంగాణ కీర్తిని నలుదిశలా చాటుతున్న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు విదేశాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. గ్లోబల్‌ అలూమ్ని మీట్‌ పేరుతో వేరువేరు దేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులకు ఒక వేదికపైకి తీసుకొచ్చేలా భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. ఈ వేడకకు రాని వాళ్లు అదే రోజు ఆయా దేశాల్లో ఉన్న విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో అక్కడే వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంతోనే అందరినీ శతాబ్ది ఉత్సవాల్లో భాగస్వామ్య చేయడంతోపాటు ఆర్థికంగానూ ఓయూకి అండగా ఎలా నిలబడాలి. దాని కోసం దీర్ఘకాలికంగా ఎలాంటి ఏర్పాటు చేయాలి అనేది చర్చించనున్నట్లు సమాచారం.