గవర్నర్ గిరీ కృష్ణంరాజుకు దక్కుతుందా?
MarinaSkies
Kizen

గవర్నర్ గిరీ కృష్ణంరాజుకు దక్కుతుందా?

11-08-2017

గవర్నర్ గిరీ కృష్ణంరాజుకు దక్కుతుందా?

నీనటుడు కృష్ణంరాజు గవర్నర్ గిరీని ఆశిస్తున్నారా? గవర్నర్ల నియామకం జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కృష్ణంరాజు దంపతులు ప్రధాని మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కృష్ణంరాజు గతంలో బీజేపీ ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆయన తిరిగి కమలం గూటికి చేరుకున్నారు. పెద్దగా పార్టీలో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ కృష్ణంరాజు అనేకసార్లు బీజేపీ నేతలతో కలిసి రావడం చర్చకు దారి తీస్తోంది.

కొద్దిరోజుల్లోనే అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల నియామంకం జరగనుంది. ఈమేరకు ప్రధానమంత్రి కార్యాలయం కసరత్తులు ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న కృష్ణంరాజు గవర్నర్ గిరీపై కన్నేసినట్లు సమాచారం. ప్రభాస్ పుణ్యమా…అని….. ఏపీలో బీజేపీ నేతలను గవర్నర్లుగా నియమిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష‌్ణంరాజు దంపతులు ప్రధాని మోడీని కలిశారు. అయితే ఈ బేటీ కేవలం మర్యాదపూర్వకమేనని చెబుతున్నప్పటికీ కృష్ణంరాజు మాత్రం గవర్నర్ పదవి కోసమనేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణంరాజు సోదరుడు కుమారుడు ప్రభాస్ టాలివుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. బాహుబలి రెండు సినిమాలతో ఆయన జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. యూపీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధాని మోడీ బాహుబలి సినిమా గురించి ప్రస్తావించారు. ప్రభాస్ ను తీసుకుని గతంలో కృష్ణంరాజు దంపతులు ప్రధానిని కలిశారు. ఏపీలో కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇస్తే ప్రభాస్ అభిమానులు కూడా బీజేపీ పక్షాన చేరతారని ఆ పార్టీ భావిస్తోంది. మరి కృష్ణంరాజుకు గవర్నర్ పదవి దక్కుతుందా? ఏమో చూడాలి మరి. బీజేపీలో ఏదైనా జరగొచ్చంటున్నారు విశ్లేషకులు.