ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం
APEDB

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం

11-08-2017

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం

భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహసింగ్‌, కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు  విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై గెలుపొందిన సంగతి తెలిసిందే.