ఉనికి కోసమే నంద్యాలలో పోటీ: కోట్ల
APEDB

ఉనికి కోసమే నంద్యాలలో పోటీ: కోట్ల

11-08-2017

ఉనికి కోసమే నంద్యాలలో పోటీ: కోట్ల

నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు లేవని, కేవలం ఉనికి  కాపాడుకునేందుకే పోటీ చేస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. కర్నూలులోని కాంగ్రెస్‌  పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారంలో నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నికలకు నాంది కాదని అభిప్రాయపడ్డారు.