మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ
Ramakrishna

మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ

11-08-2017

మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో వెంకయ్య నాయుడిచేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. అనంతరం నేరుగా రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య.. చైర్మన్‌ పీఠంపై కూర్చొని సభను నడిపించారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ప్రధాని మోదీ, విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం తరువాత జన్మించినవాళ్లలో ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఇదొక అరుదైన సందర్భం. కేంద్ర మంత్రిగా దేశానికి ఆయన ఎంతో సేవ చేశారు. వెంకయ్య..1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు.