సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

17-07-2017

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నికకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. సచివాలయంలో ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు గంట పాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో గెలుపుకోసం ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇన్‌చార్జ్‌లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఇన్‌చార్జ్‌లుగా నిమ్మల రామానాయుడు, బోండా ఉమ, బోడే ప్రసాద్‌సహా 12 మంది ఎమ్మెల్యేలు నియమించినట్లు తెలుస్తోది. ఈ 12 మంది ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.