ఏపీలో నూరు శాతం పోలింగ్
MarinaSkies
Kizen
APEDB

ఏపీలో నూరు శాతం పోలింగ్

17-07-2017

ఏపీలో నూరు శాతం పోలింగ్

అమరావతి అసెంబ్లీ ప్రాంగణం వేదికగా రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. నిర్ణీత గడువుకంటే ముందుగానే నూరుశాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత టీడీపీ, వైకాపాలు విడివిడిగా తమ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాయి. ఆ తరువాత ఒక్కొక్కరుగా వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. సరిగా పదిగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఓటు వినియోగించుకోగా, ఆ తరువాత ఓటను సభాపతి కోడెల శివప్రసాదరావు వేశారు. ఓటింగ్‌ ప్రారంభమైన గంటకే ఒకరిద్దరు మినహా టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత వైకాపా ఎమ్మెల్యే ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనగా అదికూడా మధ్యాహానికి పూర్తయింది. మిగిలిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రెండుగంటలకల్లా తమ ఓట్లు వినియోగించుకోవడంతో ఓటింగ్‌ ప్రక్రియ ముగిసినట్లు రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణ వెల్లడించారు.