రాష్ట్రపతి ఎన్నిక: ఏపీలో, తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు
MarinaSkies
Kizen
APEDB

రాష్ట్రపతి ఎన్నిక: ఏపీలో, తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు

17-07-2017

రాష్ట్రపతి ఎన్నిక: ఏపీలో, తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు

రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు నవ్యాంధ్ర రాజధానిలో, తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాదులో ఓటు వేస్తున్నారు

ఏపీలో ఎవరికెన్ని ఓట్లు?

ఏపీలో అధికార టిడిపి, బిజెపి, ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యేల ఓట్లు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే పడనున్నాయి. నవ్యాంధ్రలో ఎమ్మెల్యేల ఓట్లు 27,666. ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు పడే ఎంపీల ఓట్ల విలువ 22,656.

దేశవ్యాప్తంగా ఎంపీలకు ఓటు విలువ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఏపీ ఎంపీల ఓటు విలువ కూడా 708 పాయింట్లు. ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఒక్కో ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలువ 159.

భూమా మృతితో..

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల మృతి చెందారు. మిగతా వాళ్లు ఓటు వేయనున్నారు. 174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇక, ఏపీ నుంచి విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. వారి ఓటు విలువ 2,832. ఏపీలో 174 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు?

తెలంగాణలో ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708. విపక్షాల అభ్యర్థికి ఓట్లు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వేయనున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు.

తెరాస నుంచి 90 ప్రజాప్రతినిధులు ఉన్నారు. బిజెపికి ఐదుగురు, టిడిపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేస్తారు. మజ్లిస్ తటస్థంగా ఉంటుంది. మిగతా వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీరు మీరా కుమార్‌కు ఓటు వేస్తారు.

తెలంగాణలో ఓటు విలువ..

తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్కో ఓటు విలువ 132. మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708. లోకసభ, రాజ్యసభ ఎంపీలు 24 మంది. ఇటీవల రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. దీంతో 23 మంది ఉన్నారు. వీరి ఓటు విలువ 16,284. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 31,992 పాయింట్లు.

తెరాసకు 90 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో తెరాస ఓటు విలువ 23,916. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఈ పార్టీ ఓట్ల విలువ 1,368. టిడిపి ఓట్ల విలువ 396. వీరంతా కోవింద్‌కు ఓటేస్తారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు కాంగ్రెస్ సభ్యులు ఓటు వేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. వీరి ఓట్ల విలువ 4,548

 

బొస్టన్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
అమెరికాలో తన పరిథి మరింత పెంచుకుంటున్న నాట్స్


జులై 16 వెస్ట్ బోరో, మసాచుస్సెట్స్ : అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన పరిధిని మరింత పెంచుకుంటోంది. అమెరికాలోని ప్రతి నగరంలో నాట్స్ చాప్టర్లు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే బొస్టన్ నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది.  పవన్ వేమూరి నాయకత్వంలో బొస్టన్ లో నాట్స్ చాప్టర్ కు శ్రీకారం చుట్టారు. నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ తో పాటు నాట్స్ జాతీయ ప్రతినిధులు శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ల , సూర్య గుత్తికొండ లు బొస్టన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగువారి కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను మోహన కృష్ణ మన్నవ వివరించారు.. నాట్స్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి బోస్టన్ చాప్టర్ ప్రారంభంలో కీలక పాత్ర పోషించారు. బొస్టన్ లో ఇక ముందు నాట్స్ తన సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తుందని శ్రీహరి మందాడి అన్నారు. తెలుగువారి కోసం నాట్స్ చేస్తున్న కృషిని చూసే తాము బొస్టన్ లో నాట్స్ చాప్టర్ ప్రారంభించాలని ముందుకొచ్చినట్టు నాట్స్ బొస్టన్ చాప్టర్ సమన్వయకర్త పవన్ వేమూరి అన్నారు. బొస్టన్ లో నాట్స్ నాయకత్వాన్ని ఈ ప్రారంభోత్సవ వేడుకలో పరిచయం చేశారు. సునీల్ కొల్లి,  శ్రీధర్ గోరంట్ల, కల్యాణ్ కాకి, సునీల్ కంభంపాటి, రాజేష్ పాటిబండ్ల,  రాఘవ నన్నూరి,  శ్రీనివాస్ గొంది, గౌతమ్ చుండూరు, ప్రసాద్ లక్కల తదితరులు ఇక ముందు బొస్టన్ నాట్స్ చాప్టర్ ను ముందుకు నడిపించడంలో తమ వంతు పాత్ర షోషిస్తారని పవన్ వేమూరి తెలిపారు