అమెరికాలో భారతీయుల భద్రతకు అన్ని చర్యలు
Ramakrishna

అమెరికాలో భారతీయుల భద్రతకు అన్ని చర్యలు

11-03-2017

అమెరికాలో భారతీయుల భద్రతకు అన్ని చర్యలు

అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులపై లోక్‌సభలో పలువురు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా తాము సురక్షితంగా, భద్రతగా ఉండగలమన్న భరోసా అక్కడి భారతీయులకు కల్పించేలా ప్రభుత్వం వీలైన అన్నిచర్యలు చేపడుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అమెరికాలో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌హత్యోదంతం నేపథ్యంలో.. భారతీయులపై జాత్యహంకార దాడులపై లోక్‌సభలో పలువురు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.