ఏపీ రాజధాని రామరావతే

ఏపీ రాజధాని రామరావతే

14-12-2019

ఏపీ రాజధాని రామరావతే

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సృష్టం చేసింది. అమరావతి నుంచి రాజధానిని మార్చే ప్రతిపాదన లేదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసనమండలి సభ్యులు పి.శమంతకమణి, జి.దీపక్‌కుమార్‌, పి.అశోక్‌బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సభ్యులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న మార్షల్స్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు రెండో రోజూ ఆందోళనకు దిగడంతో ప్రశ్నోత్తరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చివరిగా మండలిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ఉపచైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నోత్తరాలపై ఇచ్చిన సమాధానాలను ఆమోదిస్తున్నట్లుగా వెల్లడించారు.