ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్టు

ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్టు

17-07-2019

ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్టు

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్టయ్యాడు. ఓ కేసు విచారణలో భాగంగా లాహోర్‌ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సయీద్‌ను కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

లష్కరే తోయిబా అనుబంధ సంస్థే జమాత్‌ ఉద్‌ దవా. 2008 నవంబరులో ముంబయిలో ఉగ్రవాదులు మారణహోమం జరిగింది. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి హఫీస్‌ జయిద్‌ సూత్రధారి. దీంతో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఉగ్రవాదసంస్థను కూడా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. సయీద్‌పై అమెరిక 10 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించింది.