ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందికి రావు

ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందికి రావు

25-04-2019

ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందికి రావు

ఆంధ్రప్రదేశ్‌లో పేదల పథకాలకు నిధుల విడుదలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించడంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పసుపు-కుంకుమ, పింఛన్లు, రైతుల పెట్టుబడి సాయానికి బడ్జెట్‌లో కేటాయింపులున్నాయని గుర్తు చేశారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో నిధులు లేవు అనడంపై యనమల అభ్యంతరం తెలిపారు. అన్నదాత సుఖీభవకు రూ.5000 కోట్లు, పసుపు-కుంకుమకు రూ.4000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. పింఛన్ల కేటాయింపును బడ్జెట్‌లో సృష్టంగా పేర్కొన్నామన్నారు. కోడ్‌ అమల్లోకి రాకముందే రైతులకు, మహిళలకు, చెక్కులు పంపిణీ చేశామన్నారు. బడ్జెట్లో ఉన్న ఈ పథకాలు ఎన్నికల కోడ్‌ కిందికి రావని ఇప్పటికే కోర్టులు సృష్టం చేసిన విషయాన్ని యనమల ప్రస్తావించారు. అలాంటి పథకాలపై ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించడం సరికాదన్నారు.