18వ తేది ఎన్టీఆర్ 23వ వర్ధంతి ఘనంగా జరపాలి: చంద్రబాబు

18వ తేది ఎన్టీఆర్ 23వ వర్ధంతి ఘనంగా జరపాలి: చంద్రబాబు

12-01-2019

18వ తేది ఎన్టీఆర్ 23వ వర్ధంతి ఘనంగా జరపాలి: చంద్రబాబు

18వ తేది ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర పార్టీ బాధ్యులు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో లెజండరీ రక్తదాన శిబిరాలు. నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి. నాలుగేళ్లుగా లెజండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దంత వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు జరుపుతున్నాం. ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ రావడం ఒక మైల్ స్టోన్. ఎన్టీఆర్ బయోపిక్ అందరికీ స్ఫూర్తినిస్తుంది. మిగిలిన వాళ్లది అందరి మాదిరిగా ఒక కథ. కానీ ఎన్టీఆర్ ది మాత్రం ఒక చరిత్ర. ఎన్టీఆర్ వర్ధంతిని చారిత్రాత్మకంగా జరపాలి. దీనిని పేదల పండుగగా చేయాలి. పేదల సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. అతిగొప్ప మానవతావాది ఎన్టీఆర్. తనది మానవతావాదమని గర్వంగా చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నాం. పేదల సంక్షేమాన్ని తరువాత దశకు చేర్చాం. ఒకవైపు సంపద సృష్టిస్తున్నాం. పేదలకు సంక్షేమం పెద్దఎత్తున చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చేలా కృషి.
నాలుగున్నరేళ్లలో పించన్ 10రెట్లు చేశాం. రూ.200 నుంచి రూ.2వేలకు పెంచాం. పేదల్లో 10రెట్లు సంతృప్తి నింపాం. పించన్లు నిరుపేదలకు ‘ఎన్టీఆర్ భరోసా’గా చేశాం. వికలాంగులకు నెలకు రూ.3వేలు ఇస్తాం. డయాలసిస్ పేషంట్లకు రూ.3,500ఇస్తాం. రైతులకు 9గం కరెంటు సరఫరా ప్రకటించాం. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం.
రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం. అవినీతి రహిత రాష్ట్రాలలో 3వ స్థానం సాధించాం. పేదలకు సంక్షేమంలో అగ్రగామిగా ఉన్నాం.