డొనేషన్ బాక్సులపై సానుకూలంగా స్పందించిన లోకేశ్

డొనేషన్ బాక్సులపై సానుకూలంగా స్పందించిన లోకేశ్

12-01-2019

డొనేషన్ బాక్సులపై సానుకూలంగా స్పందించిన లోకేశ్

అన్న క్యాంటీన్లలో డొనేషన్ బాక్సులను పెట్టాల్సిన అవసరం ఉంది.
‘అన్న క్యాంటీన్ లో భోజనం అదిరిపోయింది, కానీ గిల్టీగా ఫీల్ అవుతున్నా’ అని చెప్పిన నెటిజన్.. స్పందించిన నారా లోకేశ్!
అన్న క్యాంటీన్ లో తొలిసారి తిన్నానన్న నెటిజన్
తక్కువ ధరకే తిన్నందుకు గిల్టీగా ఫీలవుతున్నానని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జగదీశ్ అనే నెటిజన్ అన్న క్యాంటీన్ల పనితీరుపై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చంద్రబాబు గారూ, లోకేశ్ గారూ.. విజయవాడలోని 22వ వార్డులో ఉన్న అన్న క్యాంటీన్ లో మొదటిసారి భోజనం చేశాను. అంత రుచికరమైన భోజనం కేవలం రూ.5కే తిన్నందుకు అపరాధ భావన కలిగింది. క్యాంటీన్ సిబ్బందికి రూ.100 ఇచ్చేందుకు యత్నించాను. కానీ కుదరలేదు. అన్న క్యాంటీన్లలో డొనేషన్ బాక్సులను పెట్టాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేశారు. ఇందుకు నారా లోకేశ్ స్పందిస్తూ..‘అది మంచి ఆలోచనే. ఈ ప్రతిపాదనను అమలు చేస్తాం. మరోసారి ధన్యవాదాలు జగదీశ్’ అని ట్విట్టర్ లో జవాబు ఇచ్చారు.