శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

09-11-2018

శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. మొదటి గంట నివేదన అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఘంటా మండపంలోకి వేంచేశారు. బంగారు వాకిలి ఎదుట ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను గరుడాళ్వారుకు అభిముఖంగా కొలువుదీర్చారు. సేనాధిపతి విష్వక్సేనుల వారిని స్వామివారికి ఎడమవైపున మరో పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు, శ్రీమలయప్ప స్వామివారికి రెండో అర్చన పూర్తి చేశారు. గమేకార్లు ఆస్థాన ప్రసాదాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించగా రెండో గంట పూర్తయ్యింది. పెద్దజీయంగార్‌ శిరస్సుపై 6 పట్టువస్త్రాలను వెండిపళ్లెంలో ఉంచుకుని ఊరేగింపుగా ఆనంద నిలయానికి చేరుకొని శ్రీవారికి సమర్పించారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి ఆస్థానాన్ని పూర్తి చేశారు.