ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు

ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు

16-10-2018

ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు తీపి కబురు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితి నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. తాజా నిర్ణయంతో యూనిఫాం సర్వీసులు (పోలీసు, ఎక్సైజ్‌, అగ్నిమాపక, అటవీ, రవాణా శాఖ) ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు జనరల్‌ విభాగానికి చెందిన అభ్యర్థులు 42 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ  ఇటీవల అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.