సీఎం చంద్రబాబుకు ఊరట

సీఎం చంద్రబాబుకు ఊరట

13-10-2018

సీఎం చంద్రబాబుకు ఊరట

బాబ్లీ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోర్టులో ఊరట లభించింది. ఆయన తరపు న్యాయవాదులు వేసిన రీకాల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును ఉపసంహరించింది. అరతే గాకుండా విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. వాయిదా సమయంలో ఆయన తరపు న్యాయవాదులు తప్పనిసరిగా హాజరుకావాలని సృష్టం చేసింది. వ్యక్తి గత పూచీకత్తు లేకుండా లీగల్‌ అథారిటీ సర్వీసెస్‌కు రూ.15వేల పూచీకత్తును చెల్లించాలని ఆదేశించింది. మిగతావారు మాత్రం ఈ నెల 15వ తేదీన వాయిదాకు హాజరు కావాలని సృష్టం చేసింది. బాబ్లీ ఉద్యమ కేసులో చంద్రబాబుతో పాటు మరో 15 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. దీనిపై ధర్మాబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.