ఘనంగా దసరా సంబరాలు

ఘనంగా దసరా సంబరాలు

13-10-2018

ఘనంగా దసరా సంబరాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువైన దుర్గామల్వేశ్వరస్వామి దేవస్థానంలో దసరా సంబరాలు ఘనగా జరుగుతున్నాయి. మూడోరోజు గాయత్రీదేవి అలంకారం కావడంతో భక్తులు లక్ష దాటారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనానికి అనుమతించగా సాయంత్రం 6 గంటలలోపు 80 వేల దాటారు. రాత్రి 11 గంటల వరకూ అవకాశం ఉండడంతో కనీసం మరో 20 వేల మంది దర్శించుకుంటారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, అమర్‌నాథ్‌రెడ్డి, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ నంద కిషోర్‌ సింగ్‌, సినీనటుడు రాజేంద్రప్రసాద్‌, అంబికాకృష్ణ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.