ములాయం కోడలు ఓడిపోయింది
Ramakrishna

ములాయం కోడలు ఓడిపోయింది

11-03-2017

ములాయం కోడలు ఓడిపోయింది

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యురాలికి కూడా ఓటమి తప్పలేదు. ములాయం కోడలు, ప్రతీక్‌యాదవ్‌ భార్య అపర్ణాయాదవ్‌ లఖ్‌నవూ కంటోన్మెంట్‌ స్థానం నుంచి బరిలో దిగారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీజీపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి కమలం గుర్తుపై ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అరంగ్రేటం చేసిన అపర్ణాయాదవ్‌ బహుగుణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అపర్ణ కోసం ములాయం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రచారం కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపూల్‌ యాదవ్‌ సైతం అపర్ణాయాదవ్‌ కోసం ప్రచారం నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది.