భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం : సుష్మ

భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం : సుష్మ

15-03-2017

భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం : సుష్మ

అమెరికాలో ఉంటున్న భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. అమెరికాలో భారతీయులపై దాడిని లోక్‌సభ ఖండించింది. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ  భారతీయుల భద్రతపై యూఎస్‌ ఉన్నతాధికారులతో సంప్రదించామని వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇటువంటి దాడుల ప్రభావం అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై పడదన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యల్లో ఉన్నట్లు తెలిసినా 24 గంటల్లో పరిష్కరించేందుకు కృసి చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల అమెరికాలో దాడికి గురైన కూచిభొట్ల శ్రీనివాస్‌, దీన్‌రాయ్‌ గురించి ఆమె ప్రకటన చేశారు. వారిద్దరి కుటుంబాలతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఘటనలపై అమెరికా అధికారులతో మాట్లాడామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. కూచిబొట్ల శ్రీనివాస్‌ మృతి చాలా బాధాకరమని సుష్యా ఆవేదన వ్యక్తం చేశారు. దాడులపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అన్నారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ప్రభుత్వం మౌనంగా లేదని ఆమె సృష్టం చేశారు. అమెరికా వెళ్తునన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ట్రావెల్‌ అడ్వైజరీని సూచించలేదన్నారు.