రామ మందిరం నిర్మాణానికి మూహూర్తం ఎప్పుడు?

రామ మందిరం నిర్మాణానికి మూహూర్తం ఎప్పుడు?

15-03-2017

రామ మందిరం నిర్మాణానికి మూహూర్తం ఎప్పుడు?

యూపీలో బీజేపీ గెలిచింది. ఇక రామమందిరం నిర్మాణం కల సాధ్యమయినట్టేనా? ఇక్కడా అక్కడా అధికారం కమలనాధులదే మరి మందిరం నిర్మాణానికి ముహూర్తం ఎప్పుడు? గడిచినా మూడు దశాబ్దాలుగా ఎన్నికలొచ్చినప్పుడల్లా బీజేపీకి గుర్తొచ్చే రామ మందిరాన్ని వ్యూహాత్మకంగానే మానిఫెస్టోలో వెనక్కి నెట్టేసినా 325 స్థానాలు కట్టబెట్టిన ఓటర్లు మాత్రం దానిని విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇలా గెలిచారో లేదో, ఆర్‌ఎస్‌ఎస్‌ సహా దేశ వ్యాప్తంగా ఉన్న హిందూత్వ సంస్థలన్నీ రామ మందిరం నిర్మాణం అంశాన్ని లేవనెత్తిన బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.  యూపీలోనూ, కేంద్రంలోనూ అధికారం బీజేపీదే కాబట్టి రామ మందిరం నిర్మాణ అంశం చూడాలని శివసేన డిమాండ్‌ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.