గాంధీనగర్ నుంచి ఆడ్వాణీ?

గాంధీనగర్ నుంచి ఆడ్వాణీ?

19-09-2018

గాంధీనగర్ నుంచి ఆడ్వాణీ?

బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి తిరిగి పోటికి దిగాలని భావిస్తున్నారా? అవునంటున్నారు గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్‌ వాఘేలా. ఇటీవలే జరిగిన భేటీలో గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తానని ఆడ్వాణీ తనతో చెప్పారని వాఘేలా తెలిపారు. మోదీ సైతం ఆడ్వాణీ పోటీ చేయాలని కోరారని వెల్లడించారు. తమ అభ్యర్థులకు 75 ఏళ్లు దాటితే పోటీ చేయరాదని బీజేపీ గత ఏడాది ఒక నిబంధనను ఏర్పరించింది. దీంతో ఆడ్వాణీ వంటి సీనియర్‌ నేతలు ఇక పోటీ చేయరని అందరూ భావించారు. కర్ణాటక ఎన్నికల్లో యెడ్యూరప్ప పోటీ చేసేందుకు వీలుగా బీజేపీ ఆ నిబందనను తొలగించడంతో సీనియర్లకు మార్గం సుగమమైంది.