ఐటీలో దూసుకుపోతున్న ఎపి - లోకేష్

ఐటీలో దూసుకుపోతున్న ఎపి - లోకేష్

19-09-2018

ఐటీలో దూసుకుపోతున్న ఎపి - లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అనువైన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌ అన్నా రు. మంగళవారం చైనాలో వరల్డ్‌ ఎకనామిక్‌ న్యూ ఛాంపియన్స్‌ వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. మొదటి రోజు జరిగిన మూడు సమావేశాల్లో పాల్గొన్న మంత్రి అసెంబ్లి ఆఫ్‌ సిటీ లీడర్స్‌, గ్రీన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ముఖ్య సభ్యులు ప్రత్యేకంగా భేటీ కాగా మంత్రి లోకేష్‌ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

అదేవిధంగా హియర్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ మెలోడీతో మంత్రి లోకేష్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతుందని, ఫ్రాంక్లిన్‌, కాన్డ్యూయెంట్‌ లాంటి కంపెనీలు విశాఖపట్టణానికి వచ్చాయని తెలిపారు. ఏపీలో నైపుణ్యం ఉన్న యువతి, యువకులు ఉన్నారని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తియ్యడానికి ప్రతి నెలా హ్యాకధాన్స్‌ నిర్వహిస్తున్నామని నూతన ఆవిష్కరణలు జీవితంలో ఒక భాగంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కంపెనీ విస్తరణలో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అక్టోబర్‌లో జరిగే ఫింటెక్‌ ఛాలెంజ్‌ ఈవెంట్‌లో పాల్గొనాలని మోలోడీకి మంత్రి లోకేష్‌ ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి జరుగుతున్న అభివద్ధి చూసిన తరువాత ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. దీనికి స్పందించిన మెలోడీ త్వరలోనే ఏపీకి వస్తామని, కంపెనీలో చర్చించిన తరువాత పెట్టుబడులు పెట్టే అంశంపై నిర?యం తీసుకుంటామన్నారు.