కాంగ్రెస్ కు షాక్

కాంగ్రెస్ కు షాక్

12-09-2018

కాంగ్రెస్ కు షాక్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి గులాబీ గూటికి చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో సురేష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేశారు. ఆయనతో పాటు మాజీమంత్రి నేరెళ్ల ఆంజనేయులు, ఉప్పల్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బండారి లక్ష్మారెడ్డిలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.