పోలవరంలో మరో అద్భుత ఘట్టం

పోలవరంలో మరో అద్భుత ఘట్టం

12-09-2018

పోలవరంలో మరో అద్భుత ఘట్టం

 ఆంధ్రుల కలల ప్రాజెక్టయిన పోలవరం నిర్మాణంలో ఈ రోజు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌ వే నిర్మాణంలో భాగమైన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు, స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్యాలరీ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. ఈ శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పోలవరం నిర్మాణంలో పెద్ద మైలురాయిని అధిగమించాం. ప్రాజెక్టు త్వరలోనే  వంద శాతం పూర్తవుతుంది. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని అన్నారు.