ఏపీ సీఎస్ గా అనిల్‌చంద్ర పునేఠా !

ఏపీ సీఎస్ గా అనిల్‌చంద్ర పునేఠా !

12-09-2018

ఏపీ సీఎస్ గా అనిల్‌చంద్ర పునేఠా !

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా అనిల్‌చంద్ర పునేఠాను నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్‌ దినేశ్‌కుమార్‌ ఈ నెలాఖరుకు రిటైర్‌ కానున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా గతంలో పనిచేసిన వారికి రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా మూడు నెలల, ఆరునెలలపాటు పొడిగింపు ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే ప్రస్తుత సీఎస్‌ దినేశ్‌కుమార్‌ రిటైర్‌మెంట్‌ సమయం వరకే పనిచేయాలని, పొడిగింపు కోసం అడగకూడదన్న ఉద్దేశంతో ఉన్నారు. అన్నీ పరిశీలించాక పునేఠాను తదుపరి సీఎస్‌గా నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.