ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు
APEDB
Ramakrishna

ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు

11-03-2017

ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు

శ్రీవేంకటేశ్వరస్వామికి నిర్వహించే ఆర్జిత సేవాటికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులు అందుబాటులో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్న విషయం విషయం తెలిసిందే. మన దేశంతోపాటు అమెరికా, శ్రీలంక, దుబాయ్‌, జార్జియా తదితర దేశాల నుంచి భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని, స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొంటున్నారు. తాజాగా జూన్‌ 1 నుంచి 30 వరకు భక్తులు బుక్‌ చేసుకుకోవడానికి వీలుగా మార్చి 3న ఉదయం 11 గంటలకు 48,690 టికెట్లను టీటీడీ ఇంటర్నెట్‌లో విడుదల చేసింది.