నాకు, తనకు తేడా జగనే చెప్పారు: చంద్రబాబు

నాకు, తనకు తేడా జగనే చెప్పారు: చంద్రబాబు

14-03-2017

నాకు, తనకు తేడా జగనే చెప్పారు: చంద్రబాబు

నాకు, తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని జగనే చెప్పాడని, ఆ తేడా ఏమిటో ఈరోజు ప్రజలు గమనించారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనభ వాయిద పడిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంతో వైస్‌ అంత తీవ్రంగా తనను ఎవరూ విమర్శించలేదని, అయినా ఆయన చనిపోయినప్పుడు తాను వెళ్లి పరామర్శించానని అన్నారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దని గవర్నర్‌ కలిసి అడ్డుకున్నవారే మంత్రి పదవి రాక క్షోభతో చనిపోయారని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగిరెడ్డి మానసిక క్షోభకు గురిచేసింది జగన్‌ కాదా? అని ప్రశ్నించారు. పక్షలు, పశువులు కూడా తమ సాటి జీవి చనిపోతే సానుభూతి చూపుతాయని,  కానీ జగన్‌ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారన్నారు. అఖిలప్రియను తాము సభకు పిలవలేదని, తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందుకు బాధ్యతగా ఆమే వచ్చారని తెలిపారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సభలో చెప్పెకునేందుకు వచ్చారని అన్నారు.