శాశ్వతంగా తొలిస్థానంలో మనమే ఉంటాం

శాశ్వతంగా తొలిస్థానంలో మనమే ఉంటాం

12-07-2018

శాశ్వతంగా తొలిస్థానంలో మనమే ఉంటాం

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటిస్థానంలో ఉన్నామని, శాశ్వతంగా మనమే తొలిస్థానంలో ఉంటామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. వేతనాలు పెంచింనందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబును అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు సంఘటితం కావాలని అన్నారు. శాశ్వత అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు చంద్రన్నబీమా వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆగస్టు 15లోపు అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సెల్‌ఫోన్లు ఇస్తామన్నారు. కేంద్రం సహకరించకపోయినా నిలదొక్కుకునే శక్తి వచ్చిందంటే కారం ప్రజల సహకారమే అని పేర్కొన్నారు.