ఢిల్లీకి మాజీ సీఎం

ఢిల్లీకి మాజీ సీఎం

12-07-2018

ఢిల్లీకి మాజీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కిరణ్‌ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి, రాహుల్‌గాంధీ భేటీ కానుండటంతో కాంగ్రెస్‌లో ఆయన పున ప్రవేశం ఇక లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.