2019లోనూ మోడీదే హవా : అమెరికా

2019లోనూ మోడీదే హవా : అమెరికా

14-03-2017

2019లోనూ మోడీదే హవా : అమెరికా

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోడీ హవా మరింత పెరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీనే విజేతగా నిలుస్తారని అమెరికా నిపుణులు జోస్యం చెబుతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తూంటే 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సాధారణమైనవి కావని తేలినట్లు భారతీయ వ్యవహారాల పరిశీలించే అమెరికా నిపుణులు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా మోడీ హవానే కొనసాగుతుందని, తర్వాత కూడా ఆయనే దేశాన్ని నడిపిస్తారని జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ ఆడమ్‌ జిగ్‌ఫెల్డ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు బీజేపీకి గొప్ప విజయంగా అయన అభివర్ణించారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీనే విజేతగా నిలబడతారని సదానంత్‌ ధూమే అనే నిపుణుడు తెలిపారు.  2019 ఎన్నికల్లో మోడీకి మెజార్టీ రాకపోయినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇర్ఫాన్‌ నూరుద్దీన్‌ తెలిపారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు కొంత ప్రభావం చూపవచ్చని అన్నారు.