గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి : చంద్రబాబు
MarinaSkies
Kizen
APEDB

గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి : చంద్రబాబు

13-06-2018

గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి : చంద్రబాబు

అమరావతిని గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త నగరంలో తమకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు పిలుపునిచ్చారు. సాంకేతికతను మేళవించి ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరాలను పరిశీలించామని తెలిపారు. సింగపూర్‌, అమ్‌స్టర్‌డ్యామ్‌ నగరాలకు లేని ఫ్రెష్‌వాటర్‌ అమరావతి సొంతమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు ఇక్కడికి వచ్చాయని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు చంద్రబాబు తెలియజేశారు. బాబు పిలుపుపై రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లు స్పందిస్తూ భూములిచ్చి రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన రైతులు ముందుకొస్తే అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సృష్టం చేశారు.