ఆ ఘనత సీఎం చంద్రబాబుకే

ఆ ఘనత సీఎం చంద్రబాబుకే

13-06-2018

ఆ ఘనత సీఎం చంద్రబాబుకే

పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోస్తా జిల్లాలకే కాకుండా రాయలసీమకు కూడా వరం లాంటిదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న కలను చంద్రబాబు సాకారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం తాను దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై త్వరలో ప్రధాని మోదీని కలుస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన సృష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వైసీపీ, బీజీపీ కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. విభజన హామీలన్నింటిని నెరవేరిస్తేనే బీజేపీ నేతలకు కనీస గౌరవం దక్కుతుందన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఉపయోగం లేదన్నారు. ఏపీకి మేలు చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని విమర్శించారు.