స్వచ్ఛ ఐకానిక్‌గా మంత్రాలయం

స్వచ్ఛ ఐకానిక్‌గా మంత్రాలయం

13-06-2018

స్వచ్ఛ ఐకానిక్‌గా మంత్రాలయం

కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ ప్రాజెక్టు ఫేజ్‌-3లో కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి క్షేత్రం చోటు దక్కించుకుంది. మంత్రాలయం రాఘవేంద్రుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రాజెక్టుకు ఈ క్షేత్రం ఎంపిక కావటంతో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం అందనున్నది. మంత్రాలయం భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా భక్తులకు అనువైన ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్‌ కేంద్రాలుగా గుర్తిస్తారు.