ఇస్రో కంప్యూటర్ సైంటిస్ట్ గా గుంటూరు యువతి
APEDB
Ramakrishna

ఇస్రో కంప్యూటర్ సైంటిస్ట్ గా గుంటూరు యువతి

14-03-2017

ఇస్రో కంప్యూటర్ సైంటిస్ట్ గా గుంటూరు యువతి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లో కంప్యూటర్‌ శాస్త్రవేత్తగా గుంటూరు జిల్లాకు చెందిన దివ్వ అనే యువతి ఎంపికయ్యారు.  ముప్పాళ్ల మండలం నార్నెపాడుకు చెందిన మైనేని చంచయ్య, పద్మావతి దంపతుల కుమార్తె దివ్వ, ఇటీవల ఇస్రో నిర్వహించిన పరీక్షలో జాతీయ స్థాయి ప్యానెల్‌ డిస్కషన్‌లో మొదటి స్థానంలో నిలవడంతో ఆమెను ఎంపిక చేశారు. దివ్వ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్య చదివారు. బాచ్చుపల్లిలోని ప్రయివేటు కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివిన దివ్య, ప్రస్తుతం కందిలోని ఐఐటిలో ఎంఎస్‌ చదువుతున్నారని ఆమె తండ్రి చంచయ్య తెలిపారు.