ఆడపిల్లల జోలికి వస్తే ఉపేక్షించొద్దు : చంద్రబాబు

ఆడపిల్లల జోలికి వస్తే ఉపేక్షించొద్దు : చంద్రబాబు

16-05-2018

ఆడపిల్లల జోలికి వస్తే ఉపేక్షించొద్దు : చంద్రబాబు

పాతగుంటూరులో బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఆడబిడ్డలకు రక్షగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరగాలని సూచించారు. ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ధివస్తుందని అన్నారు. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అశాంతి, అభద్రత, సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి అధికారులు అండగా నిలవాలని, వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.