ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు

16-05-2018

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు

కర్ణాటక జేడీఎస్‌ నేత కుమారస్వామి సంచలన విషయాలు వెల్లడించారు. ఎలాగైనా అధికారంలోకి రావడానికి చూస్తున్న బీజేపీ తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు, మంత్రి పదవి ఇవ్వజూపిందని ఆరోపించారు. ఈ బ్లాక్‌ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ దగ్గర కోట్ల డబ్బు ఉందని, అదంతా బ్లాక్‌మనీయా లేక వైట్‌ మనీయా అని కుమారస్వామి నిలదీశారు. నల్లధనంపై పోరు అంటూనే ప్రధాని మోదీ తన ఎమ్మెల్యేలను అదే బ్లాక్‌మనీతో కొంటున్నారని విమర్శించారు. బీజేపీ ఉత్తర భారతంలో అశ్వమేథ యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్రాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడితో బీజేపీ అశ్వమేధ యాత్ర ముగుస్తుంది అని అన్నారు. తానే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ ముందు మీ మెజార్టీ ఎంతో చూసుకోండి అని చెప్పారు.