చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు

చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు

19-04-2018

చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టబోయే దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని మున్సిపల్‌ మైదానంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు ముఖ్యమంత్రి దీక్షలో కూర్చుంటారని తెలిపారు. ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షకు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దీక్షలు చేపడతారని, ఆయా ప్రాంతాల ప్రజలు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. గ్రామాల్లో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు దీక్షల్లో పాల్గొంటారని తెలిపారు.