దోషులెవరూ లేకపోతే... పేలుళ్లు ఎలా జరిగాయి?

దోషులెవరూ లేకపోతే... పేలుళ్లు ఎలా జరిగాయి?

16-04-2018

దోషులెవరూ లేకపోతే... పేలుళ్లు ఎలా జరిగాయి?

మక్కా మసీదు పేలుళ్లలో దోషులెవరూ లేకపోతే మరి పేలుళ్లు ఎలా జరిగాయని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు పెట్టడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాసిక్యూషన్‌ ఎందుకు  ఫెయిలైందో, దీని వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. ఈ కేసులో నిందితులందరికీ శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. గాంధీ ఫ్యామిలీ పాలించినప్పుడే ఈ దేశం సంతోషంగా ఉందని సర్వే చెప్పుకొచ్చారు.