తమని తాము శిక్షించుకోరాదు...అన్యాయం చేసిన వారిని శిక్షించాలి

తమని తాము శిక్షించుకోరాదు...అన్యాయం చేసిన వారిని శిక్షించాలి

16-04-2018

తమని తాము శిక్షించుకోరాదు...అన్యాయం చేసిన వారిని శిక్షించాలి

తమని తాము శిక్షించుకోరాదని, అన్యాయం చేసిన వారిని శిక్షించాలని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు చేపట్టిన రాష్ట్రబంద్‌పై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహిచిన టెలీకాన్ఫరెన్స్‌ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక్కరోజు బంద్‌ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఉద్యమసంస్థలు ఆలోచించాలన్నారు. తాము చేపట్టే నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. అరగంట సేపు నిరసనలో పాల్గొని మరో గంటసేపు అదనంగా పని చేయాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో టీడీపీ మినహా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌, వైసీపీ, జనసేన పార్టీలు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.