హైదరాబాద్ లో రియల్ పరుగులు

హైదరాబాద్ లో రియల్ పరుగులు

31-03-2018

హైదరాబాద్ లో రియల్ పరుగులు

హైదరాబాద్‌ నగరంలో మరోసారి రియల్‌ ఎస్టేట్‌ రంగం ముందుకు దూసుకుపోతోంది. కొత్తగా లేఅవుట్ల అభివృద్ధి, భవన నిర్మాణాలు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు, పెట్రోలు బంకుల ఏర్పాటుకు ఎన్‌వోసీ, ఎల్‌ యూసీ, చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ అనుమతులను నెలరోజుల్లోపే హెచ్‌ఎండిఎ మంజూరు చేస్తోంది. తద్వారా సులభతర అనుమతులు లభిస్తుండటంతో దరఖాస్తులతో డెవలపర్లు పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌కు మరింత ఊతమిచ్చేలా అభివృద్ధి రుసుం చెల్లింపులో ఒకేసారి చెల్లింపు విధా నం నుంచి వాయిదాల పద్ధతిని అమలు చేస్తున్నారు. రూ.15 లక్షల కంటే ఎక్కువ విలువజేసే దరఖాస్తులకు ఈ వాయిదాల పద్ధతిని వర్తింపజేయడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిర్మాణదారులు ముందుకొస్తున్నా రు.